గెలుపు వ్యూహంలో సత్తా చాటిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచేలా కృషి చేసి కల్వకుంట్ల తారక రామారావు సక్సెస్ లీడర్‌గా పేరు పొందారు. ప్రత్యక్ష ప్రచారానికి వెళ్ళకుండానే విభిన్నవ్యూహంతో టీఆర్‌ఎస్‌కు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని అందించారు. చరిత్రలో ఎన్నడూ సాధించనన్ని గ్రామపంచాయతీలలో టీఆర్‌ఎస్ విజయదుందుభి మోగించింది. స్వతంత్రుల తో కలుపుకుని టీఆర్‌ఎస్ మద్దతుదారులు, కార్యకర్తలు దాదాపు 80 శాతం పంచాయతీలలో విజయబావుటా ఎగరేశారని పార్టీవర్గాలు వివరిస్తున్నాయి. తెరాస పుట్టిన తర్వాత గ్రామీణస్థాయిలో అంతగా వేళ్ళూనుకోలేదని, సంస్థాగత నిర్మాణలోపాలున్నాయన్న ప్రచారం జరగ్గా ఈ పంచాయతీ ఎన్నికలతో అది అంతా తుడిచిపెట్టుకుపోయిందని, పల్లెనుండి రాజధాని దాకా పటిష్టపునాదులు ఏర్పడ్డాయని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రత్యర్ధులంతా ఏకమైనా.. గులాబీజెండా రికార్డు మెజారిటీలతో రెపరెపలాడింది. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని మరోసారి పంచాయతీ ఎన్నికల సందఠంగా రుజువైందని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలకు, పార్టీ ప్రధానకార్యదర్శులకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చేసిన సూచనలు క్షేత్రస్థాయిలో ప్రభావం చూపాయని, ప్రచారానికి దూరంగా తాను ఉండడం కూడా ఒక వ్యూహమేనని అదే సమయంలో ఎమ్మెల్యేలు రాజకీయభవిష్యత్ ద ష్ట్యా తమతమ నియోజకవర్గాలపై దష్టిసారించాల్సిన అనివార్యత కల్పించారని అంటున్నారు. మొత్తంగా హడావుడి లేకుండా.. సైలెంట్‌గా పంచాయతీ టాస్క్‌ను కేటీఆర్ ఫినిష్ చేశారని, ప్రభంజనంలాంటి విజయాలతో తన సత్తాను చాటుకున్నారని చెబుతున్నారు.
ఎన్నిక ఏదైనా కేటీఆర్ అనుసరించే వ్యూహాలు, శ్రమించే తీరు, కలిసిపోయే విధానం నేతలను అబ్బురపరుస్తుంది. తొలిసారి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించగా చరిత్రలో ఏపార్టీ సాధించని విధంగా 99స్థానాలతో సింగిల్‌గానే మెజారిటీ సాధించి జీహెచ్‌ఎంసిపై గులాబీ జెండా ఎగరేశారు. టీఆర్‌ఎస్ కనీస్థాయిలో పోటీ ఇస్తుందా అన్న సందేహాల నడుమ మొదలైన పోరాటం సరికొత్తచరిత్ర లిఖించేలా చేసింది. తర్వాత పాలేరు శాసనసభ ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ చేశారు. ప్రత్యర్ధులు ఎవరైనా, యోధానుయోధులు ఎందరొచ్చినా లక్ష్యంవైపు గురిచూసి సంభ్రమాశ్చర్యపరిచే విజయం సాధించడం కేటీఆర్‌కు రివాజుగా మారింది. ఎన్నికల తర్వాత కేటీఆర్ సమర్ధతను గుర్తించి కార్యనిర్వాహక అధ్యక్షునిగా అధినేత కేసీఆర్ బాధ్యతలు అప్పగించగా, ఇపుడు తొలి టాస్క్‌నే విజయవంతంగా ముగించారు. పంచాయతీపోరులో టీఆర్‌ఎస్ విజయవిహారానికి బాటలుపరిచారు. శాసనసభ ఎన్నికల ఆనందం నుండి తేరుకోకముందే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం పార్టీ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని అందించింది. కేటీఆర్ నాయకత్వంలో పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయకేతనం?ఎగురవేయడం?ఖాయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.