Vajpayee: విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి వాజ్‌పేయి
నేటి యువతరానికి అటల్ బిహారీ వాజ్‌పేయి (Vajpayee) జీవితం ఆదర్శప్రాయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం (Khammam)లో నిర్వహించిన అటల్ జీకి అక్షర నీర్పుానం పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి వాజ్‌పేయి అని కొనియాడారు. ఆయన్ను హృదయ సామ్రాట్ గా పిలుచుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. దేనినైనా మాటల్లో చెప్పకుండా చేతుల్లో చేయడం ఆయనకే సాధ్యమన్నారు. రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే వారికి పోలింగ్ (Polling) బూత్‌లతో సమాధానం చెప్పాలని సూచించారు. సిద్ధాంతాలను మరిచి రాద్ధాంతాలు చేసే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. ఏ గాలికి ఆ అజెండా పట్టేవారిని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















