సమ్మర్ లో చల్లదనంతో పాటు శక్తిని కూడా అందించే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్..

26th March 2026

White Scribbled Underline

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి సమయంలో రాగి, పెసరపప్పుతో చేసే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మంచి ఎంపిక.

ముందుగా ఒక గ్లాస్ రాగులను రాత్రంతా నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అది సాఫ్ట్‌గా మారి సులభంగా ఉడుకుతుంది.

పెసరపప్పును తక్కువ మంటపై స్వల్పంగా వేయించాలి. తరువాత కడిగి ఒక గంట పాటు నీళ్లలో నానబెట్టాలి.

నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన రాగులను వేసి ఉడికించాలి. అది సగం మెత్తబడిన తర్వాత మాత్రమే పెసరపప్పు కలపాలి.

రెండూ కలిసి నెమ్మదిగా ఉడికేలా చూడాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి కావలసిన తిక్కదనం వచ్చేవరకు మంటపై ఉడికించాలి.

మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసి కలపాలి. ఇది పొంగలి మాదిరిగా మృదువుగా తయారవుతుంది. ఇందులో కావాలంటే కాస్త సన్నగా తరిగిన కూరగాయలు, ఎర్రగడ్డ కలపవచ్చు.

తాలింపు కోసం నెయ్యి, జీలకర్ర, మిరియాలు, అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిని మిశ్రమంలో కలిపితే రుచి మరింత పెరుగుతుంది.

ఈ వంటకం శరీరానికి చలువనిస్తుంది. షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం.