తెలంగాణ నూతన గవర్నర్ గా రాధాకృష్ణన్ … రేపు ప్రమాణం

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీసీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. రాత్రి 9:10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి 10:55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విమానాశ్రయంలో స్వాగతం పలకనున్నారు. బుధవవారం ఉదయం 11:15 గంటలకు రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్‌భవన్ వేదికగా కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.