హైదరాబాద్ కు మరో ఐటీ కంపెనీ
ప్రపంచవ్యాప్తంగా 32 వేలకు పైగా రెస్టారెంట్ల వ్యాపారానికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న అమెరికాకు చెందిన ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్లో తన సృజనాత్మక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో సేవలకు ఇప్పటికే 100 మందిని సంస్థ నియమించుకుంది. 2025 నాటికి 500 మంది నిపుణులను నియమించనున్నట్లు సంస్థ సీఈఓ పాల్బ్రౌన్ తెలిపారు. ఇన్స్పైర్ బ్రాండ్స్ సృజనాత్మక కేంద్రాన్ని హైదరాబాద్లో ప్రారంభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అమెరికాకే చెందిన ఏఎన్ఎస్ఆర్ కంపెనీతో కలిసి బాస్కిన్`రాబిన్స్, బఫెలోవైల్డ్ వింగ్స్, డంకిన్ సహా పలు ప్రతిష్ఠాత్మక రెస్టారెంట్లకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎస్ఆర్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ లలిత్ అహూజా, ఉద్యోగులు పాల్గొన్నారు.






