ప్రపంచం చూపు హైదరాబాద్ వైపే…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చర్యలతో హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దాదాపు 1,500 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రంగా మారిందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉంటే, 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు చేరిందని వివరించింది. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44% వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.60 లక్షల నుంచి 9,05,715 మందికి చేరిందని పేర్కొన్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, సమర్థ నాయకత్వానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. దీంతో భారతదేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతి ఏటా అధికంగానే ఉంటున్నది.
భారతదేశ సిలికాన్‌వ్యాలీగా, ఐటీ క్యాపిటల్‌గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును అధిగమించే దిశగా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తున్నది. యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్‌స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్ క్రిస్లర్, మాస్‌మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్మ్యాన్సాచ్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, పెప్సి వంటి కంపెనీలను ఆకర్షించడంతోపాటు ఫేస్బుక్, క్వాలామ్, అక్సెంచర్, వేల్స్ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఐటీ రంగ విస్తరణ మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, వినోద రంగాలపై సైతం ప్రభావం చూపింది. టైర్-2 నగరాల్లో సైతం ఐటీ టవర్లను నిర్మిస్తూ స్థానిక యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అమెజాన్ డేటా సర్వీసు సెంటర్ రూ.20,761 కోట్లతో ఫాబ్ సిటీ, ఫార్మా సిటీ, చందన్ వెల్లిలలో 3 డేటా సెంటర్లను నెలకొల్పడం గమనార్హం. నేషనల్ పే మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 500 కోట్లతో స్మార్ట్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. అదేవిధంగా సేల్స్ ఫోర్స్ రూ.1119 కోట్లతో విస్తరణ చేపట్టింది. గోల్డ్ మాన్ శాబ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2500 మందికి ఉద్యోగాలు లభించాయి. అమెరికన్ ఇన్సూరెన్స్ దిగ్గజ కంపెనీ మాసాచూసెట్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ రూ. 1000 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఒప్పో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నది. ఇలా అనేక దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. కార్పొరేట్ రంగంలో ప్రముఖ కంపెనీలు తమ లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్‌లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాయి.
రాజకీయ సుస్థిరత, సమర్ధ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలతో అంతర్జాతీయ పారిశ్రామిక. ఐటీ రంగాలను హైదరాబాద్ ఆకర్శిస్తోంది. యాపిల్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్ స్ట్రీట్ర్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్ క్రిస్లర్, మాస్ మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్ మ్యాన్ సాచ్స్, జెడ్.ఎఫ్, యుబిఎస్, పెప్సి, లేగటో లాంటి కంపెనీలను ఆకర్షించడం తో పాటు ఫేస్ బుక్, క్వాల్కామ్, అక్సెంచర్, వేల్స్ ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోప్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలు విస్తరించాయి.
ఐ.టి. రంగం అభివృద్దితో అనుబంధ మిగతా రంగాలైన నిర్మాణ రంగం, రవాణా రంగం. వినోద రంగాలపై ప్రభావం పడుతోంది. ఒక పక్క ఐ.టి రంగంలో దూసుకుపోతుండగా టైర్-2 నగరాలలో ఐ.టీ టవర్ల నిర్మాణంతో కొత్త కంపెనీలు ఏర్పాటవడంద్వారా స్టానిక యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
స్టార్టప్ క్యాపిటల్‌గా తెలంగాణ
స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నెలకొల్పిన టీహబ్-1, టీహబ్-2 సాంకేతికరంగ అభివృద్ధిలో సృష్టిస్తున్న అద్భుతాలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ‘ఆలోచనలతో రండి.. ఆవిషరణలతో వెళ్లండి’ అనే నినాదంతో 2015 నవంబర్ 5న గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీహబ్ ప్రారంభమైంది. ఇది దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గానే కాకుండా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది. దీనికి మంచి స్పందన రావడంతో తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2ను ప్రపంచలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా భారీస్థాయిలో నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్‌గ్రిడ్ పథకం)ను చేపట్టింది. మొదటి దశలో భాగంగా 33 జిల్లాలు, 12,769 గ్రామపంచాయతీలు, 142 పట్టణ స్థానిక సంస్థలు, 30,000 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పిస్తున్నది. మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు చేపట్టింది.






