అన్ని రంగాల్లో మహిళలు మార్గదర్శులుగా రాణించాలి : CS Dr. వరలక్ష్మి నరాల

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్స్టిట్యూట్ అఫ్ కంపెనీ సెక్రెటరీస్ అఫ్ ఇండియ (ICSI) హైదరాబాద్ చాప్టర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా పాల్గొని మార్గదర్శి మరియు మహిళా సాధికారత మీద ప్రసంగించడం జరిగింది. ఈ వేడుకల్లో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విజ్జులత, ICSI హైదరాబాద్ చాప్టర్ ఛైర్మెన్ శ్రీ లక్ష్మినారాయణ గుప్త మెంబెర్స్ వెంకట రమణ, మహాదేవ్, లలితా దేవి, శిల్పాబంగ్ తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మహిళలు విద్యా, ఆర్థిక, వ్యాపార, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం వంటి అనేక రంగాలలో అత్యద్భుతంగా రాణిస్తూ దేశప్రగతి & ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములుగా నిలుస్తున్నారు
మహిళల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ, బ్యాంకులు మహిళల అభివృధ్ధికోసం ప్రత్యేకంగా రూపొందించిన వివిధ ఫైనాన్స్ స్కీమ్స్ ను ఉపయోగించుకొని వివిధ రంగాలలో ఎలా రాణించాలలో తెలియజేయడం జరిగింది. వివిధ రంగాల్లో రాణించిన మహిళల సక్సెస్ స్టోరీస్ ను వివరించడం జరిగింది.
విజయానికి దగ్గరి దారి అంటూ ఏమి ఉండదు. ప్రతి క్షణం కష్టపడటం ఒక్కటే మార్గం. మహిళలు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా, తమకు అభిరుచి ఉన్న రంగాల్లో అడుగేయాలి. అన్ని రంగాల్లో మహిళలు మార్గదర్శులుగా రాణించాలి.
ఇన్స్టిట్యూట్ అఫ్ కంపెనీ సెక్రెటరీస్ అఫ్ ఇండియా మెంబెర్ అయిన నన్ను ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఫుడ్ కార్పరేషన్ అఫ్ ఇండియా కు కన్సల్టేటివ్ కమిటీ కి సభ్యురాలుగా నియమించింది, అందుకుగాను ఇంస్టిట్యూట్ట్ సభ్యులు నన్ను అభినందించి సన్మానించారు.