Malaysia: మలేసియాలో తెలుగు కోర్సులు

తెలుగు భాషలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణకు మలేసియా తెలుగు సంఘం (టీఏఎం) హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Potti Sriramulu Telugu University)తో ఒప్పందం కుదుర్చుకుంది. మలేసియా లోని రావాంగ్ (Rawang) లో సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, మలేసియా తెలుగు సంఘం అధ్యక్షుడు డా.వెంకటప్రతాప్, ఉపాధ్యక్షులు సత్తయ్య, సుధాకర్‌నాయుడు, సురేష్ నాయుడు, గౌరవ సలహాదారు డాక్టర్ అచ్చయ్య కుమార్‌ల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య నిత్యానందరావు(Acharya Nityananda Rao) మాట్లాడుతూ తెలుగు భాష ఉనికి పోటే తెలుగుజాతి అస్తిత్వం కోల్పోతామే ఆవేదనతో మలేసియాలో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, భాషాభిమానులు చేసిన నిరంతర కృషి ఫలితమే ఈ కోర్సులు ప్రారంభానికి శ్రీకారమన్నారు. వెంకటప్రతాప్ మాట్లాడుతూ తెలుగు భాష ఏడాది సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఏకంగా నాలుగేళ్ల డిప్లోమా కోర్సు కూడా నిర్వహించడానికి ఒప్పందం చేసుకోవడం విశేషమన్నారు.