హైదరాబాద్ లో గోల్డ్‌మన్ సాక్స్ విస్తరణ
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. మరో రెండు వేల మందికి ఉద్యోగాలు లభించేలా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ లోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, సీఈవో డేవిడ్ ఎం. సోలమన్ బృందంతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, పెట్టుబడులకున్న అనుకూల వాతావరణంతో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్టు కేటీఆర్‌తో సమావేశం అనంతరం ఆ సంస్థ సీఈవో పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా ( బీఎఫ్ఎస్ఐ) రంగాలకు అనుకూలమైన వ్యవస్థ ఉంది. విస్తరణ ప్రణాళికలో భాగంగా అక్కడ ప్రస్తుతం వెయ్యిగా ఉన్న సిబ్బంది సంఖ్యను మూడు వేలకు పెంచనున్నాం. అందుకు అనుగుణంగా కార్యాలయాన్ని మూడు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తాం అని సీఈవో డేవిడ్ ఎం. సోలమన్ వెల్లడించారు.






