హైదరాబాద్ లో యాపిల్.. 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
యాపిల్ ఉత్పత్తిని హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్లాంట్‌లో తయారు చేయనుంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్ కంపెనీ 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 2024 నుంచి ఫాక్స్‌కాన్ హైదరాబాద్ యూనిట్లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ ను తయారు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీకి కంపెనీ ఆమోదం తెలిపింది. 400 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పెద్ద ఎత్తున వచ్చే ఏడాది డిసెంబరు నుంచి ఉత్పత్తి ప్రారంభంకానుంది అని సదరు అధికారి తెలిపారు.
ఐఫోన్ తర్వాత భారత్‌లో తయారవుతున్న రెండో యాపిల్ ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి వి లీ తెలంగాణలో 400 మిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో కుదుర్చుకున్న 150 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ఇది అదనమని తెలిపారు. దీంతో ఫాక్స్‌కాన్ సంస్థ మొత్తంగా 550 మిలయన్ డాలర్లు హైదరాబాద్ ప్లాంట్‌లో పెట్టుబడిగా పెట్టనుంది.






