అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తనకు ముందే తెలుసని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎన్నికలకు 3 నెలల ముందే సీటు మార్చాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కోరానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే బీఆర్‌ఎస్ గెలుస్తుందని కేసీఆర్‌కు చెప్పా. నాతో సహా మరో 20 స్థానాలు మార్చాలని కోరా. ప్రజల అభిప్రాయం నాకు తెలుసు. వరంగల్ లోక్‌సభ స్థానంలో 30 నుంచి 40 వేల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ గెలుస్తారు. రెండో స్థానం కోసం, కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి అని అన్నారు.