తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‍గా బి.జనార్ధన్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‍గా (టీఎస్‍పీఎస్సీ) బి.జనార్ధన్‍రెడ్డి నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెంటనే ఆమోదించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనార్దన్‍రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిటైర్డ్ ఈ ఎన్సీ రమావత్ ధన్ సింగ్, ఎస్డీసీ కోట్ల అరుణకుమారి, సీబీఐటీ ప్రొఫెసర్ బీ.లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, ఆయుర్వేద వైద్యులు ఆరవెల్లి చంద్రశే•ర్‍రావు, ఆచార్య సుమిత్ర ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి టీఎస్‍పీఎస్‍సీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.