Naini : ఆయనను బ్రోకర్, లఫూట్ గాడని తిట్టలేమా? : నాయిని
కేటీఆర్ (KTR) మళ్లీ వరంగల్‌కు వస్తే చెప్పులతో కొట్టి పంపిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (Naini Rajender Reddy) హెచ్చరించారు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగామ బీఆర్ఎస్ సభలో కేటీఆర్, రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని హౌలాగాడు అని సంబోధించడం సరికాదని ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీ కుటుంబం కాళ్లు పట్టుకున్న నీవు, హౌలా అంటూ మాట్లాడుతావా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ ఐపీఎస్ అధికారిని బూతులు తిట్టారని, వాళ్ల బతుకులు అంతేనంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు సిగ్గు, శరం లేదని, ఆయనను బ్రోకర్, లఫూట్ గాడని తిట్టలేమా? అని అన్నారు. రాహుల్‌గాంధీకి క్షమాపణలు చెప్పే వరకు కేటీఆర్‌ను వదిలేది లేదని ఆయన హెచ్చరించారు.






