Revanth Reddy: దేశం కోసం ఆయన ప్రధాని కావాలి : సీఎం రేవంత్
బిఆర్ఎస్ (BRS) పాలనలో తనపై అనేక కేసులు పెట్టారని, పరువునష్టం దావా వేశారని, అయినా పోరాడానని, శనివారం కూడా కోర్టుకు వెళ్లానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నా 19 ఏళ్ల రాజకీయ జీవితంలో జడ్పీటీసీ (ZPTC) సభ్యుడి స్థాయి నుంచి సీఎం అయ్యా. పార్టీలోనూ పీసీసీ అధ్యక్ష పదవి పొందా. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మంచి అనుభవం లభించింది. నేను ఎప్పుడూ ఫైరవీలు చేయలేదు. ప్రజా సమస్యలపై గళం వినిపించా. సోనియాగాంధీ పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. దేశంలో అనేక సమస్యలపై పోరాటాలు చేయడంతోనే రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. అలాగే దేశం కోసం ఆయన ప్రధాని (Prime Minister) కావాలి. డీసీసీ అధ్యక్షులే భవిష్యత్తులో కాంగ్రెస్లో కీలక స్థానాలకు వస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం అయ్యే అవకాశాలు వారికి లభిస్తాయి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుంటేనే గుర్తింపు వస్తుంది అని అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















