మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి

బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. హనుమకొండలోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి పార్టీలోకి రావాలని కోరారు. రాజ్యసభ సీటు ఆశించినా, దక్కకపోవడంతో సీతారాం నాయక్ బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.