హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 9 నుంచి 10 వరకు రెండు రోజుల పాటు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) హైదరాబాద్ రీజియన్ 11వ వార్షికోత్సవ సమావేశాలను నగరంలోని హైటెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు బీఎన్ఐ హైదరాబాద్ ఈడీ సంజాన షా తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న కామాధేను ఏస్టేట్స్ బీఎన్ఐ గోన్యాట్ 2023 సదస్సులో ఎంఎస్ఎంఈ, స్టార్టప్-ఏకో సిస్టంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బీఎన్ఐలో 79 దేశాలకు చెందిన 3.13 లక్షల మంది సభ్యులు ఉన్నారు.






