డీఐజీ సుమతికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం

డీఐజీ సుమతికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియాలో సైబర్ సెక్యూరిటీలో ఉత్తమ కృషి చేసినందుకు ప్రతిష్టాత్మక అసోచామ్ సంస్థ విమెన్ ఇన్ సైబర్ మేకింగ్ ఏ డిఫెరెన్స్ వి భాగంలో ఈ పురస్కారానికి ఆమెను ఎంపిక చేసింది. ఆన్‍లైన్‍లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ ప్రత్యేక శాఖ కార్యదర్శి జ్యోతి అరోరా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీపై మహిళలకు తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలను అభినందించారు.