తెలంగాణకు మరో భారీ పెట్టుబడి ..రూ.16,650 కోట్లతో
జీవ వైద్య రంగంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.16,650 కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యాకలాపాలను విస్తరించడానికి ప్రపంచ ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఆసియా ఖండంలోనే జీవ వైద్య రంగంలో ఇది అతి భారీ పెట్టుబడిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. జీనోమ్‌వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌లోని సువెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు రూ.9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. మిగతా మొత్తాన్ని తమ కోహెన్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఇక్కడి మరిన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.






