రెండాకుల కోసం 50 కోట్లు!
ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం రెండాకులను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు దినకరన్పైకేసు నమోదు చేసి, మధ్యవర్తిని అరెస్టు చేశారు. ఎన్నికల అధికారి ఒకరికి దినకరన్ రూ.50 కోట్ల లంచం ఇవ్వడానికి సిద్దమయ్యారని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు చెప్పారు. దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఆయనపై ఏవిధమైన అరెస్టు వారెంట్ జారీ చేయలేదు.






