నల్ల కుబేరులకు మరో అవకాశం
దేశంలో నల్ల కుబేరులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం మరో చివరి అకాశం కల్పించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ చోజన పథకంలో భాగంగా ఆస్తుల వివరాలను ప్రకటించే గడువును పొడిగించింది. పిఎంజీకేవై కింద మే 10 వరకు పన్ను చెల్లింపులు డిపాజిట్లు ఇతర పెట్టుబడులు, ఆస్తుల విషయంలో డిక్లరేషన్ ప్రకటించాలని సీబీడీటి తెలిపింది. మార్చి 31 లోపు సర్‌చార్జ్ మరియు పెనాల్టీ చెల్లించిన వారు ఏప్రీల్ 30 లోపు డిపాజిట్ పథకం కింద డిపాజిట్ చేసిన వారికి ఈ డిక్లరేషన్‌కు ఆవకాశమని సీబీడిటి ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన ఈ గడువును మే 10 వరకు పొడిగించింది. 2016 ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ స్కీం కింద ఆన్లైన్లో తమ ఆదాయ వివరాలను ప్రకటించాలని చెప్పింది.













