అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయ సాధనకు కృషి
జీఎస్టీ స్ఫూర్తితో అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయ సాధనకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన మాట్లాడారు.వ్యవసాయంలో ఆదాయం పెంపొందించే పద్ధతులను అవలంబించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మంచి విధానాలను కేంద్ర ప్రభుత్వం నేర్చుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించే అంశంపై చర్చించాలని అన్నారు. అన్ని రాష్ట్రాలు దీని గురించి ఆలోంచించాలని చెప్పారు. ముఖ్యమంత్రులు అందరికీ తాము పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని తెలిపారు.













