ఎన్ఆర్ఐలకు 15 శాతం సీట్లు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపిఇ) అందిస్తున్న పిజిడిఎం ప్రోగ్రాంలలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవాస భారతీయుల సంతానానికి పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కోటాలో 15 శాతం అదనపు సీట్లు కేటాయించడానికి తమ ఇన్స్టిట్యూట్ అనుమతి పొందిందని ఐపిఇ డైరెక్టర్ ప్రొఫెసర్ రాంకుమార్ మిశ్రా తెలిపారు. అలాగే ఎఐసిటిఇ గుర్తింపు పొందిన పిహెచ్డితో సమానమైన ఫెలో ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకురావడానికి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ రంగాలలో 60 శాతం మార్కులు కలిగిన పిజి పట్టభద్రులు ఫెలో ప్రోగ్రాంలో చేరవచ్చని అన్నారు. ప్రస్తుతం విదేశాలలో నివాసం ఉంటూ భారత పౌరసత్వం కలిగిన వారి సంతానానికి ఐపిఇ పిజిడిఎం ప్రోగ్రాంలలో 60 మంది చేర్చుకోవడానికి ఎఐసిటిఇ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో డీన్ శ్రీనివాసమూర్తి, రిజిస్ట్రార్ కిరణ్మయిలు పాల్గొన్నారు.






