రాష్ట్రపతి రేసులో నితీశ్ కుమార్!
నూతన రాష్ట్రపతి ఎవరు అనే అంశంపై దేశవ్యాప్తంగా ఓ వైపు చర్చ నడుస్తున్న సందర్భంలో జేడీయూ కార్యదర్శి కేసీత్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశేష అనుభవం, అర్హతలు ఉన్న జేడీయూ జాతీయాధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రపతి పదవికి అన్ని విధాల అర్హుడు అని మండ్యాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. జేడీయూతో పాటు భావ సారూప్యమున్న పార్టీలు నితీశ్ రాష్ట్రపతి బరిలో నిలవాలని కోరుకుంటున్నాయని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీ విధానాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.













