Sai Prasad: ఏపీ సీఎస్ గా సాయిప్రసాద్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ (Sai Prasad) బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టీటీడీ (TTD), దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య, ప్రత్యేక పూజల అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా సేవలందించిన విజయానంద్ (Vijayanand) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎసఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు (Krishna Babu), ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు ముకేశ్‌కుమార్ మీనా, కాంతిలాల్ దండే తదితరులు సచివాలయం సహా వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















