Sachin Tendulkar: అది నాకు గోల్డెన్ మూమెంట్ : సచిన్
ప్రజల్ని జడ్జ్ చేయొద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) అన్నారు. దీని వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పుట్టపర్తి (Puttaparthi)లో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారు. వారి ఉన్నతికి కృషి చేశారు. శారీరక ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన గెలుపు. సత్యసాయిని కలిసిన ఎవరికైనా ఈ విషయం అర్థమయ్యేది. 2011 వరల్డ్‌కప్‌లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. అప్పుడు బెంగళూరు (Bangalore)లో ఉన్నాం. సత్య సాయిబాబా (Sathya Sai Baba) ఫోన్ చేశారు. అనంతరం ఒక పుస్తకం పంపారు. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. మేం ఆ సంవత్సరం ట్రోపీ కూడా గెలుచుకున్నాం. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని తెలిపారు.






