Puttaparthi: సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పుట్టపర్తి (Puttaparthi)లోని ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవానికి మోదీ హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉన్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి మోదీ చేరుకున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ తదితరులు హాజరయ్యారు.






