సింగపూర్ లో మంత్రి నారా లోకేశ్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సింగపూర్ (Singapore) చేరుకున్నారు. ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ (Royal Enfield Company) తీసుకొచ్చినందుకు లోకేశ్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులే లక్ష్యంగా పలువురు ప్రతినిధులతో లోకేశ్ భేటీ కానున్నారు. ఎంఐటీ (MIT)లో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ భేటీలో పాల్గొంటారు. సన్‌టెక్ లో కమోడిటీస్ సీఐసీ, సీఎఫ్ వో తో సమావేశమవుతారు. డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతోనూ లోకేశ్ భేటీ కానున్నారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






