శ్రీసిటీలో నిమ్రాన్ స్టీల్స్ ప్రారంభం
టోక్యోకు చెందిన నిప్పాన్ స్టీల్ ట్రేడిరగ్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌టీసీ) అనుబంధ సంస్థ నిమ్రాన్ స్టీల్ సర్వీస్ సెంటర్ ఇండియా (ఎన్ఎస్ఎస్ఐ) తన నూతన పరిశ్రమను శ్రీసిటీలో ప్రారంభించింది. ఏసీలు, ఆటోమొబైల్ తయారీ రంగాలకు అవసరమైన ఉష్ట నిరోధక స్టీల్ ప్రెస్ పార్ట్స్‌తో పాటు ఇతర భాగాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ మసయుకి టాగాతో పాటు ఎన్‌ఎస్‌టీసీ ప్రెసిడెంట్ షినిచి నమమురా, డైకిన్ వైస్ మేనేజింగ్ డైరెక్టర్ షోగో ఆండ్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) డైరెక్టర్ జనరల్ కౌరు షిరైషి, శ్రీసిటి ఎండీ డా.రవీంద్ర సన్నా రెడ్డి, ఎన్ఎస్ఎస్ఐ ఎండీ హిరోషి ఇటో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసయుకి టాగా, షినిచి నకమురా మాట్లాడుతూ స్థానిక యువతకు శిక్షణ ఇచ్చేందుకు త్వరలోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.






