Nara Lokesh: ప్రతి అడుగు ప్రజా శ్రేయస్సుకే.. పుట్టపర్తిలో నారా లోకేష్ ప్రజాదర్బార్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పించిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ప్రజాదర్బార్ (Praja Darbar) నిర్వహణను పద్ధతిగా కొనసాగిస్తున్నారు. ప్రారంభంలో మంగళగిరి (Mangalagiri) లోని తన నివాసంలో ప్రజల సమస్యలు, అభ్యర్థనలు స్వీకరించిన ఆయన… ఇప్పుడు తాను ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే స్థానికులకు సమయం కేటాయిస్తూ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సాధారణ ప్రజలతో పాటు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.
దీర్ఘకాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది ప్రజలు తమ సమస్యల పరిష్కరణకు ఈ ప్రజాదర్బార్‌ను అవకాశంగా తీసుకుని, తమ వినతులను మంత్రి లోకేష్‌కు సమర్పిస్తున్నారు. అందుకున్న ప్రతి అభ్యర్థనను సంబంధిత అధికారులకు పంపించి వెంటనే చర్యలు తీసుకునేలా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా పుట్టపర్తి (Puttaparthi) లోని తన క్యాంప్ సైట్లో ఆయన వరుసగా 74వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు, టిడిపి కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఒక్కొక్కరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెండింగ్‌లో ఉన్న పనులు, న్యాయం కోసం చేసిన విజ్ఞప్తులను శ్రద్ధగా విన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా (Sri Satya Sai District) ముదిగుబ్బ మండలం మలకవేముల గ్రామానికి చెందిన డి. లోకేష్ (D. Lokesh) తన సమస్యను వివరించారు. వైసీపీ పాలన సమయంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) ప్రోత్సాహంతో తనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఈ కేసులను పరిశీలించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్‌ను అభ్యర్థించారు.
అదే జిల్లాలోని మాకర్లకుంటపల్లి గ్రామానికి చెందిన టి. నాగభూషణం (T. Nagabhushanam) తన ఇంటి స్థలం సమస్యను తెలియజేశారు. చెన్నేకొత్తపల్లి (Chennekothapalli) ప్రాంతంలో తాను కొనుగోలు చేసిన రెండున్నర సెంట్ల స్థలాన్ని గత ప్రభుత్వ హస్తక్షేపంతో హనుమంతరెడ్డి (Hanumantha Reddy) ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. భారీగా అందుతున్న అన్ని వినతులను శ్రద్ధగా పరిశీలిస్తామని, సంబంధిత శాఖలకు పంపించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజలకు చేరువగా ఉండే ఈ ప్రయత్నం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






