Atchannaidu: ఆందోళన వద్దు.. చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా
మొంథా తుపాను నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను పక్కా ముందస్తు ప్రణాళికతో, పకడ్బందీ ఏర్పాట్లతో విజయవంతంగా అధిగమించగలిగామన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను (Agricultural scientists) , అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. తుపాను కారణంగా రైతులు (Farmers) నష్టపోతే పూర్తిగా ఆదుకుంటామని తెలిపారు.







