Janasena: ప్రతి కార్యకర్తకూ అండగా జనసేన నాయకత్వం : నాగబాబు
జనసేన (Janasena) పార్టీ ప్రతి కార్యకర్తకూ గుండె ధైర్యంలా నిలబడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు (Nagababu) అన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన 220 మంది కార్యకర్తల కుటుంబాలకు తాడేపల్లిలో ఆయన బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.11 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు (Nagababu) మాట్లాడుతూ జనసేన పార్టీ జెండాను భుజాలపై మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉండాలనే ఉద్దేశంతో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రవేశపెట్టిన ప్రమాద బీమా, 1,400 మంది కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెల్లి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నాయకులు పాల్గొన్నారు.






