Nitish Kumar: నితీశ్ ప్రమాణస్వీకారోత్సవంలో చంద్రబాబు, లోకేశ్
బిహార్ సీఎంగా నితీశ్‌కుమార్ (Nitish Kumar) ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) , మంత్రి లోకేశ్ (Minister Lokesh) హాజరయ్యారు. పట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. యూపీ, మహారాష్ట్ర సీఎంలు యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడణవీస్ చంద్రబాబు, లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్, బీజేపీ అగ్రనేత రవిశంకర్ ప్రసాద్, బిహార్‌కు చెందిన పలువురు ఎన్డీయే నేతలతోనూ వారిరువురూ సమావేశమయ్యా రు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ ఎన్డీయే తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసి పలువురు ఎన్డీయే నేతలు లుక్ మారింది, బాగా సన్నబడ్డారు. ఏం డైట్ ఫాలో అవుతున్నారు? వ్యాయామాలేం చేస్తున్నారు? అంటూ వాకబు చేశారు.






