Chandrababu: లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. తుపాను దృష్ట్యా ప్రజలకు సహాయ సహకారాలు అదించాలని కోరారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు (MLAs), కార్యకర్తలంతా అందుబాటులో ఉండాలన్నారు. కూటమి కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అవసరమైతే కేంద్ర సాయం కూడా కోరతామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇవాళ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉంది. రియల్ టైమ్‌లోనే మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నాం. పంట నష్ట నివారణ చర్యలను అధికారులకు తెలియజేశాం. ఆకస్మిక వరదల దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించాం అని తెలిపారు.







