AP EPCS: ఏపీ ఈపీసీఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
ఇంజినీరింగ్ (Engineering), వ్యవసాయ, ఫార్మసీ (Pharmacy) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్.మోహన్ రావు(N. Mohan Rao) వెల్లడించారు. ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో మార్చి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుము రూ.వెయ్యితో మార్చి 21, రూ.2వేలతో మార్చి 25, రూ.4వేలతో మార్చి 30, రూ.10వేలతో ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల తప్పుల సవరణకు ఏప్రిల్ 4`6 వరకు అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12 నుంచి 15 వరకు, 18న నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో ఉంటాయి. ప్రాథమిక కీ మే 23న విడుదల చేసి, 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫలితాలు జూన్ 1న ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

















