పాస్‌పోర్టులో పెళ్లైనా ఇంటిపేరు మార్చుకోన్కకరలేదు…
పెళ్లైన అనంతరం మహిళలు పాస్‌పోర్టులో తమ ఇంటి పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని, ప్రయాణ పత్రాలు పొందేందుకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పేరును వాడుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నిబంధనలు మారాయని, ఇక నుంచి పాస్‌పోర్టు పొందేందుకు మహిళలు వివాహ ధ్రువీకరణ లేక విడాకుల పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇండియన్ మర్చంట్స్ చాంబర్స్ (ఐఎంసీ) మహిళా విభాగాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ మహిళలే లక్ష్యంగా అభివృద్ధి పథకాలు కొనసాగాలన్నదే తన అభిమతమన్నారు.






