యునెస్కో గుర్తింపు పొందనున్న లేపాక్షి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రేండున్నరేళ్లలో రాష్ట్రాన్ని సత్వతోముఖాభివౄద్ధికి కౄషి చేస్తున్నారు. నవ్యాంధ్రను ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగాతీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కళలు, చరిత్ర, బౌగోళిక చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాలకు అంతర్జాతీయస్థాయి గుర్తింపునకు పాటుపడుతున్నారు. అందులోభాగంగానే పురాతన, చిత్ర, శిల్పకళల, కాణాచిగా గుర్తింపు పొందిన ‘లేపాక్షీఅంతర్జాతీయ గుర్తింపుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్త్తున్నాయి.
విజయనగరరాజుల కాలంలో గొప్ప వాణిజ్యకేంద్రంగా, పురాతన చిత్ర, శిల్పకళల కాణాచిగా గుర్తింపు పొందిన ‘లేపాక్షి’ త్వరలో ప్రపంచపటంలో తన స్థానాన్ని పదిలం చేసుకోనుంది. ఆలయంలోని గొప్ప చిత్రాలు, చారిత్రక నేపథ్యం, అబ్బురపరిచే చిత్రలేఖనం, భౌగోళిక చిత్రపటం(సైట్ప్లాన్) తదితర వివరాలను యునెస్కో నమూనాలో పంపాలంటూ కేంద్ర ప్రభుత్వంపురావస్తుశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఎమ్మెల్యే బాలకృష్ణ సారథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
లేపాక్షికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటూ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్ష మేరకు ఇటీవల దిల్లీలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి, అమరావతిఅభివృద్ది సంస్థ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు ప్రధాని కార్యాలయ కార్యదర్శి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ రాకేష్తివారిని కలసి వినతిపత్రంఅందించారు. లేపాక్షి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు ఇచ్చేలా కేంద్ర పురావస్తుశాఖ వరల్డ్ హెరిటేజ్ డైరెక్టర్ లూర్దుస్వామి(హైదరాబాద్)కు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి సర్కిల్ సూపరింటెండెంట్ తాహీరుకు లేపాక్షికి సంబంధించి గొప్ప చిత్రాలు, భౌగోళిక చిత్రపటం, చారిత్రక నేపథ్యం, చిత్రలేఖనాలువంటివి యునెస్కో నమూనాలో పంపమని ఆదేశాలు ఇచ్చింది. పంపిన వెంటనే జాబితాలో చేరుతుంది. ఇది శుభపరిణామమని త్వరలోనే లేపాక్షి ప్రపంచపటంలోస్థానం పొందనున్నట్లు జాస్తి వీరాంజనేయులు తెలిపారు.






