అమెరికా పర్యటనలో గల్లా జయదేవ్
అమెరికాలో వివిధ అంశాలపై అధ్యయనానికి భారత పార్లమెంటరీ ఫోరం నుంచి ఆరుగురు ప్రజాప్రతినిధులు ఐదు రోజుల పర్యటనకు బయలుదేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంపీ గల్లా జయదేవ్, భతృహరి మెహతాబ్ (ఒడిసా), మీనాక్షీ లేఖీ(ఢిల్లీ), నరేంద్ర సవాయికర్ (గోవా), ప్రేమ్‌దాస్ రాయ్ (సిక్కిం), మాజీ ఎంపీ సచిన్ ఫైలట్ (రాజస్థాన్) ఉన్నారు. మే 5వ తేదీ వరకూ అక్కడ పర్యటించే ఈ బృందం ప్రముఖులతో సమావేశమై అమెరికా విదేశాంగా విధానం, ట్రంప్ పాలన, చైనా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సైబర్ సెక్యూరిటీ గురించి చర్చిస్తుంది.






