చార్ధామ్ యాత్ర ప్రారంభం
ప్రఖ్యాత చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. మంత్రోచ్చారణల నడుమ ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయ తలుపులు తెరుచుకున్నాయి. శీతకాల విరామం అనంతరం తొలి పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు తరలివచ్చారు. చార్ధామ్ యాత్రలోని మిగతా రెండు దేవాలయాలైన కేదార్నాథ్, బద్రీనాథ్‌లు వచ్చే నెల మూడు, ఆరు తేదీల్లో తెరుస్తారు. కేదార్నాథ్ తొలి పూజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బద్రీనాథ్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు.






