సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా ఆఫర్
యాభై శాతం రాయితీపై ప్రయాణం చేసేందుకు సీనియర్ సిటిజన్లకు ఎయిర్ ఇండియా మరింత వెసులుబాటు కల్పించింది. ఈ రాయితీ అర్హత వయోపరిమితిని 63 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించింది. అరవై సంవత్సరాలు దాటిన ప్రయాణికులకు ఎకానమీ క్లాస్‌లో పర్యటించేందుకు టికెట్ ధరలో 50శాతం రాయితీని ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ వెసులబాటు దేశీయ విమానాకే వర్తిస్తుందని సృష్టం చేశారు. ఈ రాయితీని పొందాలంటే సదరు ప్రయాణికులు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్ట్‌పోర్టు, డ్రైవింగ్స్ లైసెన్స్ లేదా ఎయిర్ ఇండియా జారీ చేసిన సీనియర్ సిటిజన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.













