అమెరికా అధ్యక్షుడికే భద్రత కరువాయె..!
అగ్రరాజ్యం అమెరికా..ప్రపంచాన్ని వణికించే మారణాయుధాలు అగ్రరాజ్యం సొంతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే.. ప్రపంచాన్ని తన కంటి చూపుతో వణికిస్తారు. మరి అలాంటి అమెరికాలో భద్రత ఎంతో కట్టుదిట్టంగా ఉంటుంది అని అంతా అనుకుంటారు.కానీ.. అమెరికా ప్రజాస్వామ్య సౌధం వైట్ హౌస్ కు కూతవేటు దూరంలోని అత్యంత భద్రత కలిగిన హిల్టన్ హౌస్.. తుపాకీ పేలుడు శబ్దంతో దద్దరిల్లితంది.
శనివారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’ విందులో ఓ వ్యక్తి.. కాల్పులకు తెగబడ్డాడు. సింపుల్ గా హిల్టన్ హౌస్ లాబీలోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత సీక్రెట్ సెక్యూరిటీ సర్వీసెస్ రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అంటే ఓసాదారణ పౌరుడు.. ఎంతో సునాయాసంగా అధ్యక్షుడు ఉన్న చోటుకు వచ్చేశాడు. ఈ ఘటన తలచుకుంటేనే సగటు అమెరికన్ కు భయం కలుగుతుంది..
ఈఘటన తర్వాత కూడా ట్రంప్ ధైర్యంతోనే ఉన్నారు. మీటింగ్ కొనసాగిద్దామని ట్రంప్ చెప్పగా.. అధికారులు కుదరదని తీసుకుపోయారు. అదే ఆ దుండగుడే.. అక్కడి నుంచి నేరుగా హాల్లోకి వెళ్తే ఏం జరిగేది..? ట్రంప్ మాత్రం ఇలాంటి వాటితో తాను పోరాడుతునే ఉన్నానన్నాడు. దీనికి భయపడే వ్యక్తిని కాదన్నారు.
అంతేకాదు… తనపై జరిగిన దాడికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు ట్రంప్.‘‘ అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులు, అత్యధిక కృషి చేసి వ్యక్తులు, ఉదాహరణకు అబ్రహం లింకన్ ను చూడండి, ఎవరైన భారీ ప్రజాధరణ కలిగి ఉంటారో వారినే ఇలాంటి వ్యక్తులు టార్గెట్ చేస్తారు’’ అని ట్రంప్ అన్నారు. తాను దేశం కోసం చాలా పనులు చేశానని, ఈ దేశాన్ని మార్చానని, అయితే ఈ విషయంపై సంతోషంగా లేని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతారని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ప్రజా జీవితంత ప్రమాదకరమైన జీవితమని, ఇలాంటి ఘటనలు జరిగితే చాలా మంది మానసికంగా కుంగిపోతారు, కానీ నేను అలాంటి వ్యక్తిని కాదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి






