Elon Musk :మస్క్ పై ఆగ్రహంతోనే … టెస్లాపై
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ (Elon Musk) యాజమాన్యంలోని టెస్లా విద్యుత్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికా (America), ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ చార్జింగ్ స్టేషన్లతో పాటు కార్లపైనా (Cars) ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్యల పెంపుదల విభాగం ( డోజ్) అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. మరోవైపు లాస్ వెగాస్ (Las Vegas )లో టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. అనంతరం ఒక కారుపై అభ్యంతరకర పదజాలంతో స్ప్రే పెయింట్ వేశారు. టెస్లా ఉత్పత్తి చేసిన వాహనాలపై పేలుడు పదార్థాన్ని విసిరిన ఘటనకు సంబంధించి పోలీసులు గత నెలలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. చార్లెస్టన్ సమీపంలో టెస్లా చార్జింగ్ స్టేషన్లను తగులబెట్టిన ఒక వ్యక్తిని సౌత్ కరోలినాలో అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని ట్రంప్ హెచ్చరించారు.






