ఓపీటీ దుర్వినియోగంపై అమెరికా దర్యాప్తు..!
అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అనుభవం కల్పించే యూ ఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలోని దర్యాప్తు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా ప్రభుత్వం నిర్వహిస్తున్న అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తూ దాదాపు 10 వేల మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు ఐ సి ఈ ప్రకటించింది. వీరిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారని అమెరికా అధికారులు తెలిపారు.
ఓపీటీ అనేది అమెరికాలో ఎఫ్ – 1 స్టూడెంట్ వీసాపై చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు తమ విద్యా రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో తాత్కాలికంగా పనిచేసే అవకాశం ఇచ్చే ప్రోగ్రామ్. సాధారణంగా ఇది 12 నెలలపాటు ఉంటుంది. స్టెమ్ కోర్సులు చేసిన వారికి అదనంగా 24 నెలల పొడిగింపు లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది విద్యార్థులు తరువాత హెచ్ 1బీ ఉద్యోగ వీసాలకు మారే అవకాశం పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అంటే అమెరికా వెళ్లి చదువుకునే విద్యార్థులకు చదువు పూర్తవ్వగానే దానికి సంబంధించిన పనిలో అనుభవం పొందేందుకు ఇచ్చే ఒక అవకాశం.బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు ఎఫ్-1 వీసా ఇస్తారు. చదువు పూర్తయిన వెంటనే అదే వీసా మీద 12 నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం చేసేందుకు అవకాశం ఇస్తుంది ఓపీటీ.
చదువు పూర్తయిన 90 రోజుల్లోగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. అది పొందిన వెంటనే ఒక సంవత్సరానికి వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఈ ఏడాది పాటు విద్యార్థులు ఉద్యోగం చేయవచ్చు లేదా ఇంటర్న్షిప్, వలంటీర్లుగా కూడా చేయవచ్చు.
ఇవి కూడా చదవండి






