Congress out from NC : కూటమి నుంచి కాంగ్రెస్ అవుట్.. వేడెక్కుతున్న జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు..

జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) 90 స్థానాలకుగాను నేషనల్ కాన్ఫరెన్స్ (National conference) (ఎన్.సీ) పార్టీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.మిగిలిన 5 నామినేటెడ్ సీట్లు తో కలిపి 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్.సీ 42 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) 6 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీల మద్దతుతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది.
అయితే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందు సంచల నం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్.సీకి దూరమైంది. దీంతో ఎన్.సీ తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఈ పరిణామంతో జమ్ము కశ్మీర్ లో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కినట్లు అయ్యాయి..కూటమి నుంచి తప్పుకున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అంటే, ఎన్.సీని పరోక్షంగా ఇబ్బందుల్లోకి నెట్టినట్టుగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడం.. ఎన్.సీ అధినేత ఒమర్ అబ్దుల్లాకు (Omar Abdullah) ప్రస్తుతానికి ఇబ్బంది కరం కాక పోయినప్పటికీ భవిష్యత్తులో పెను సవాలుగా మారే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణాలు ఏంటి అన్న విషయంపై స్పష్టత లేదు. ఇక ఈ నిర్ణయం పై వివిధ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah), తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 370 ఆర్టికల్ పునరుద్ధరించే విషయంపై తీర్మానం చేయిస్తామని ప్రకటించారు. ఇప్పుడైతే, ఇచ్చిన మాటకు విరుద్ధంగా దానిని తిరిగి అమలు చేస్తానని చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ విభేదించిందని టాక్. అంతేకాదు కాంగ్రెస్కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలా లేదా అన్న విషయంపై కూడా ఒమర్ అబ్దుల్లా పునర్ ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కేవలం ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్కు మంత్రివర్గంలో స్థానం అవసరమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తమ ఉనికికి ఇబ్బంది కలుగుతుంది అని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.