Iran: ఇరాన్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ లు, ఇండియన్ ఎంబసీ వార్నింగ్
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ద పరిస్థితుల ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడుతోంది. అటు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇరాన్ సర్కార్, ఇండియన్ ఎంబసీ భారతీయులకు తీవ్ర హెచ్చరికలు చేసాయి. ఇరాన్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా, టెహ్రాన్‌లోని(Tehran) భారత రాయబార(Embassy of India) కార్యాలయం చేసిన హెచ్చరికలు ఒకసారి చూస్తే, ఇరాన్లో ఉన్న భారత పౌరులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు లేదా పర్యాటకులు) ఎవరూ కూడా ఎంబసీ ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా ఇరాన్ భూ సరిహద్దులను దాటే ప్రయత్నం చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి

సరిహద్దు పాయింట్ల వద్ద పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉందని, ఎంబసీకి తెలియకుండా వెళ్లేవారు తీవ్రమైన ఇమ్మిగ్రేషన్, భద్రతాపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సమన్వయం లేని ప్రయాణాలు ఎన్కౌంటర్లకు లేదా ఇతర ప్రమాదాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒకసారి ఎంబసీకి తెలియకుండా ఇరాన్ సరిహద్దు దాటిన తర్వాత, అక్కడ చిక్కుకుపోతే భారత రాయబార కార్యాలయం ఎటువంటి సహాయం అందించే స్థితిలో ఉండదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా.. ముఖ్యంగా కమర్షియల్ ఫ్లైట్స్ ఇరాన్‌ను వీడాలని ఎంబసీ స్పష్టం చేసింది.
నిరసన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎంబసీ అధికారులతో టచ్‌లో ఉండాలని సూచించింది. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అత్యవసర సహాయం కోసం సంప్రదించవచ్చని తెలిపింది. +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359 లకు ఫోన్ చేయాలని, అదే విధంగా Email: [email protected] కు తమ సమాచారాన్ని పంపాలని సూచించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ గా సుమారు 70 మంది భారతీయ విద్యార్థులను అర్మేనియా మీదుగా సురక్షితంగా ఢిల్లీకి తరలించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి

















