Iran-Israel War: చైనా ఆయుధాలు.. నాసిరకమేనా..?
మొన్న సింధూర్.. నిన్న వెనెజులా ఆపరేషన్.. నేడు ఇరాన్ వార్.. ఎక్కడ చూసినా ఆయా దేశాలకు ఘోర పరాభవం.. సింపుల్ గా చెప్పాలంటే ఇట్టే అధినేతలు దొరికిపోతున్నారు.మరి.. వారి రక్షణకు వాడిన వ్యవస్థలు ఏమయ్యాయి. యుద్ధ విమానాలు.. నిఘా వ్యవస్థలు.. డ్రోన్లు, మిస్సైల్స్.. ఇవన్నీ ఏమయ్యాయి.దీనికి ఒకటే కారణం.. ఈ దేశాలన్నీ గంపగుత్తగా వాడినవి చైనా ఉత్పత్తి చేసిన చౌకైన ఆయుధాలు. అవి వాడిన దేశాలన్నింటికీ ఓటమి ఫ్రీ గిఫ్ట్..
ముందుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారుచేసిన డిఫెన్స్ పరికరాలపై గట్టి నమ్మకం పెట్టుకున్న పాకిస్తాన్.. కీలక సమయంలో వాటి పనితీరు చూసి షాకైంది. వాటన్నంటినీ భారత్.. ఇట్టే క్రాక్ చేసింది. ఆవ్యవస్థలన్నీ ఫెయిలయ్యాయి. కేవలం మూడంటే మూడురోజుల్లో పాకిస్తాన్.. భారత్ తో కాళ్ల బేరానికొచ్చింది. ఇక్కడ ఆ దేశం వాడిన ఆయుధాలన్నీ చైనా తయారు చేసిన ఉత్పత్తులే.
ఇక .. వెనెజువెలా.. ఈ దేశం కూడా చైనా ఉత్పత్తి చేసిన యుద్ధ పరికరాలు దిగుమతి చేసుకుంది. ఆ పరికరాలు ఉన్నాయన్న ధైర్యంతో అమెరికాపై కాలు దువ్వింది. ఏదో చుట్టాలింటికి వచ్చినట్లుగా అమెరికా దళాలు.. వెనెజువెలా వచ్చి, అక్కడి అధ్యక్షుడు మదురో దంపతులను ఎత్తుకుపోయారు. ఈసమయంలో వెనెజువెలా ఆయుధాలేవీ అక్కరకు రాలేదు. అంటే ఆ పరికరాలు కూడా కీలక సమయంలో పనిచేయలేదనేగా అర్థం.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ఇరాన్ కూడా చైనా నుంచి సాంకేతిక నైపుణ్యం, ఆయుధాల దిగుమతులు చేసుకుంది. ఇందులో మిస్సైల్ వ్యవస్థను పాకిస్తాన్ నుంచి, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్.. చైనా నుంచి దిగుమతి చేసి తెచ్చుకుంది. అవన్నీ కీలకసమయంలో పనిచేయలేదు. దీంతో ఇరాన్ కూడా గట్టి షాక్ కు గురైంది. సాక్షాత్తూ ఆదేశం సుప్రీంలీడర్ ఖమేనీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాాణాలు కోల్పోయారు.
చైనా నాణ్యత లేని లేదా నిరూపించబడని ఆయుధాలను విక్రయిస్తుందని చాలా మంది అనుమానిస్తున్నారు.ఇటీవలి సంవత్సరాల వరకు నిజమైన యుద్ధాలలో అవి చాలా అరుదుగా పరీక్షించబడ్డాయి.ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారు అయిన చైనా, దాని ఆయుధాలు తరచుగా నిజమైన పోరాటంలో విఫలమవుతుండటం వలన విశ్వాసం కోల్పోతోంది.
చైనా ఆయుధాలు ప్రధానంగా పెద్ద సంఖ్యలో ఎగుమతి కోసం ఉత్పత్తి చేయబడతాయి.అమెరికన్ లేదా రష్యన్ వ్యవస్థల వలె కఠినంగా పరీక్షించడం జరగదు..
చైనా ఆయుధాలకు చాలా వరకు డిజైన్ బలహీనతలు ఉన్నాయి; ఉదాహరణకు, కొన్ని వాయు-రక్షణ రాడార్లను సులభంగా జామ్ చేయవచ్చు లేదా నాశనం చేయవచ్చు. ఈ వ్యవస్థలు లేయర్డ్ డిఫెన్స్‌లో కూడా కలిసి పనిచేయవు. విడి భాగాలు పరిమితంగా ఉండటం మరియు వినియోగదారులకు సరైన శిక్షణ లేకపోవడం వల్ల నిర్వహణ మరొక సమస్య.అదనంగా, చైనా సాంకేతికత ఎలక్ట్రానిక్ యుద్ధాన్ని నిరోధించడం, ఆధునిక స్టెల్త్ విమానాలను గుర్తించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సమస్యల కారణంగా, చైనా ఆయుధాలపై అంతర్జాతీయ విశ్వాసం క్షీణిస్తోంది.
ఇవి కూడా చదవండి

















