పాస్ పోర్టులపైనా ట్రంప్ ఫోటో..! అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
అమెరికా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్ ముఖచిత్రం ఉన్న పాస్టుపోర్టులను (US passports)ను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమితి సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ తెలిపింది. సాదారణంగా అరుదైన సందర్భాల్లో ప్రత్యేకంగా పాస్ పోర్టులు ముద్రించడం కామన్ గా జరుగుతోంది. అయితే అధ్యక్షుడి ముఖ చిత్రంలో ఉన్న పాస్ పోర్టుల ముద్రణ మాత్రం అరుదేనని చెప్పాలి.
‘అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు జులైలో జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ సన్నద్ధమవుతుంది. ఇవి పరిమిత సంఖ్యలో ఉండనున్నాయి’ అని విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పాస్‌పోర్టులకు ఎలాంటి అదనపు రుసుము ఉండదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి
పాస్‌పోర్టులు విడుదల చేయనున్న విషయాన్ని వైట్‌హౌస్ కూడా ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అది పంచుకుంది. అందులో స్వాతంత్ర్య ప్రకటన పత్రంపై ట్రంప్ ఫొటో ఉండగా.. దాని కింద బంగారు రంగులో ఆయన సంతకం ఉంది. మరొక దానిలో యూఎస్ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అధికారంలో ఉన్న నాయకుల ఫొటోలతో పాస్‌పోర్టులు రూపొందించడం చాలా అరుదు. అనేక దేశాలు చారిత్రక దృశ్యాలు, ప్రకృతి చిత్రాలను ముద్రించేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం యూఎస్ పాస్‌పోర్టులపై చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక ప్రదేశాలు ముద్రించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో పరిమితి సంఖ్యలో పలు పాస్‌పోర్టులను రూపొందించాలనుకోవడం సంచలనంగా మారింది.
250 స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో స్మారక నాణెం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ట్రంప్ సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ట్రెజరీశాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు.
ఇవి కూడా చదవండి






