చైనాకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్!
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో, లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం వడ్డీ, పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. షావోమి, రియల్మి, ఒప్పో, వన్ప్లస్ లాంటి చైనా స్మార్ట్ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ.1,108.98 కోట్ల జీఎస్టీ, రూ.7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జులై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు.






