అలా ప్రారంభమై … ఇలా వాయిదా పడి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపుర్‌లో మరోసారి చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని విపక్షాలు ముందుగానే నిర్ణయించుకున్నాయి. దానిలో భాగంగానే అదానీ అంశంపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. భారత్‌లో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల మధ్య ప్రారంభమైన లోక్‌సభలో తొలుత ఇటీవలకాంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.