Mark Carney: కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా .. కార్నీకి మోదీ శుభాకాంక్షలు

కెనడా ఎన్నికల్లో లిబరల్స్ పార్టీ (Liberal Party) భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ(Mark Carney) మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కార్నీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో కాలంగా భారత్ (India) , కెనడా (Canada) ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైన పాలన పట్ల దృఢమైన వైఖరి, నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయని మోదీ అన్నారు. కెనడాతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి, ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి భవిష్యత్తులో ఆ దేశంతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.