మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు… ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లే

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నామన్నారు. మహరాష్ట్ర, రaార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢల్లీిలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశం ఐక్యక కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.